Sunil: త్రివిక్రమ్ ను హైదరాబాద్ తీసుకొచ్చింది నేనే: సునీల్

షార్ట్స్‌లో చూడండి
తాజాగా చిత్రలహరి సినిమాలో నటించిన హాస్య నటుడు సునీల్ తన సెకండ్ ఇన్నింగ్స్ ను ఆశించిన స్థాయిలో కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి చెప్పారు. భీమవరంలో త్రివిక్రమ్ తనకంటే ఏడాది సీనియర్ అని, సినిమాలపై మోజుతో మొదట తాను హైదరాబాద్ వచ్చానని, ఆ తర్వాత త్రివిక్రమ్ ను తీసుకొచ్చానని వెల్లడించారు.

మీ బాధలను పంచుకునే 'గ్లాస్' మేట్ ఎవరు? అన్న ప్రశ్నకు టక్కున "త్రివిక్రమ్. అని చెప్పారు. "త్రివిక్రమ్ ను నాకోసమే హైదరాబాద్ తీసుకువచ్చాను. ఎలాంటి విషయాన్నయినా పంచుకోగలిగే మిత్రుడు త్రివిక్రమ్. త్రివిక్రమ్ తో కాసేపు మాట్లాడితే చాలు ఎంతో ఉత్తేజం వస్తుంది. ఎవరు, ఎంత బాధలో ఉన్నా వాళ్లను మామూలు మనుషుల్ని చేయగలడు" అంటూ వివరించారు.
Go Back to Shorts
Sunil
Trivikram

More Telugu News