Sunil: నాది అతిజోక్యం అని చెప్పిన వాడెవ్వడూ మళ్లీ హిట్ కొట్టలేదు: సునీల్

షార్ట్స్‌లో చూడండి
నటుడు సునీల్ కమెడియన్ నుంచి హీరోగా ఎదిగి మళ్లీ కమెడియన్ గా ప్రస్థానం కొనసాగిస్తున్నారు. టాలెంట్ ఉన్నవాడు కావడంతో ఇండస్ట్రీ కూడా సునీల్ ను మళ్లీ కమెడియన్ గా ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో తాజాగా చిత్రలహరి సినిమాలో నటించారు. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సునీల్ మీడియాతో మాట్లాడుతూ అనేక ఆసక్తికర సంగతులు పంచుకున్నారు.

హీరోగా నటించిన సమయంలో తాను అతిగా జోక్యం చేసుకుంటాననే అపవాదుపై వివరణ ఇచ్చారు. తన సినిమాల్లో ప్రముఖ రైటర్లు ఎవరూ ఉండేవాళ్లు కాదని, ఓ మోస్తరు రచయితలను పెట్టుకుని తానే వాళ్లకు డబ్బులిచ్చి రాయించుకునేవాడ్నని సునీల్ వెల్లడించారు. ఆ విధంగా తనతో హిట్ కొట్టి ఆపై తాను ఎక్కువగా జోక్యం చేసుకునేవాడ్నని కొందరు రచయితలు దుష్ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, తనపై అనవసరంగా ఆరోపణలు చేసివాళ్లలో ఎవరూ మళ్లీ హిట్ కొట్టలేదని తెలిపారు. చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఉంటే పొగిడేవాళ్లు ఉంటారని, పడిపోతే మరింత బాధకు గురిచేసేవాళ్లు కూడా ఉంటారని సునీల్ వివరించాడు.
Go Back to Shorts
Sunil
Tollywood

More Telugu News