అలా చేయాలనుకుంటే వైసీపీకి ఓటేయండి: నారా రోహిత్
- ఎవరైనా నీళ్లు లేని బావిలో దూకుతారా?
- చంద్రబాబు సీఎం అయితేనే అభివృద్ధి
- చిత్తూరు జిల్లా మదనపల్లిలో రోడ్ షోలో రోహిత్
ఏపీ విడిపోయాక ఓ వైపు రాజధాని నిర్మాణాన్ని, మరోవైపు ప్రజా సంక్షేమాన్ని నిరవధికంగా అందిస్తున్న చంద్రబాబుకు ప్రజల మద్దతు సంపూర్తిగా ఉందన్నారు. మరోసారి చంద్రబాబు సీఎం అయితే, సంవత్సరం వ్యవధిలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని రోహిత్ వ్యాఖ్యానించారు. జగన్ తనపై ఉన్న కేసుల మాఫీ కోసమే నరేంద్ర మోదీతో జత కట్టాడని విమర్శించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.