రంగంలోకి రాహుల్.. నేడు విజయవాడకు కాంగ్రెస్ చీఫ్
- ఉదయం 10:45 గంటలకు విజయవాడకు రాహుల్
- బహిరంగ సభ అనంతరం కళ్యాణదుర్గం వెళ్లనున్న కాంగ్రెస్ చీఫ్
- రాహుల్ రాక ఏపీ కాంగ్రెస్‌లో జోష్ పెంచుతుందని ఆశ
ఈ ఉదయం 10:45 గంటలకు విజయవాడ చేరుకోనున్న రాహుల్.. తొలుత రాష్ట్రస్థాయి బూత్ కమిటీ కార్యకర్తలతో సమావేశం అవుతారు. కేంద్రంలో కాంగ్రెస్ ఎందుకు రావాల్సిన అవసరం ఉందో వారికి వివరిస్తారు. అలాగే రైతు రుణమాఫీ, కనీస ఆదాయ పథకంపై వారికి దిశానిర్దేశం చేస్తారు. అనంతరం 11:30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 11:40 నుంచి 12:20 వరకు రాహుల్ ప్రసంగిస్తారు. అనంతరం 12:45 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి కళ్యాణదుర్గం వెళ్తారు.