2027 ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఉన్నా లేకున్నా పెద్ద ఫరక్ పడదు: సందీప్ పాటిల్
- వారిద్దరూ జట్టులో ఉన్నా, లేకపోయినా ప్రదర్శనపై ప్రభావం ఉండదని స్పష్టీకరణ
- టీమిండియాకు బలమైన బెంచ్ స్ట్రెంగ్త్ ఉందని వెల్లడి
- ఫిట్‌నెస్, సెలక్టర్ల వ్యూహంపై వారి భాగస్వామ్యం ఆధారపడి ఉంటుందన్న పాటిల్
- ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్న రోహిత్, కోహ్లీ
2027 వన్డే ప్రపంచకప్‌లో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడటం లేదా ఆడకపోవడం వల్ల భారత జట్టు ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం ఉండదని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ సందీప్ పాటిల్ అభిప్రాయపడ్డాడు. భారత జట్టులో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు చాలామంది ఉన్నారని, వారి స్థానాలను భర్తీ చేసే సత్తా జట్టుకు ఉందని స్పష్టం చేశాడు.
దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న 2027 ప్రపంచకప్‌కు ఇంకా సుమారు ఏడాది సమయం ఉంది. అప్పటికి రోహిత్ శర్మకు 40, విరాట్ కోహ్లీకి 39 ఏళ్లు వస్తాయి. వారిద్దరూ ఆడటం అనేది వారి సంసిద్ధత, ఫిట్‌నెస్ స్థాయులు, సెలక్టర్ల వ్యూహాలపై ఆధారపడి ఉంటుందని పాటిల్ అన్నాడు.
"భారత జట్టు బెంచ్ స్ట్రెంగ్త్‌ను చూస్తే, విరాట్ లేదా రోహిత్ జట్టులో ఉన్నా, లేకపోయినా ఎలాంటి సమస్య ఉంటుందని నేను అనుకోవడం లేదు. వాళ్లిద్దరూ గొప్ప ఆటగాళ్లు, లెజెండ్స్ అనడంలో సందేహం లేదు. కానీ అవసరమైతే వారి స్థానాలను భర్తీ చేయడానికి జట్టు సిద్ధంగా ఉంది" అని సందీప్ పాటిల్ వివరించాడు.
ఇప్పటికే టెస్టులు, టీ20ల నుంచి రిటైరైన రోహిత్, కోహ్లీ.. ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు. త్వరలో వెస్టిండీస్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు కూడా వీరిద్దరూ ఎంపికయ్యారు.