తెలంగాణలో పిడుగుల ప్రళయం.. పేలిన సెల్‌ఫోన్లు.. ఇంటర్ విద్యార్థి మృతి
- రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు
- కామారెడ్డిలో ఇద్దరు రైతులకు తీవ్ర గాయాలు
- పలుచోట్ల పదుల సంఖ్యలో పశువుల మృత్యువాత
- పలుచోట్ల రహదారుల ధ్వంసం
- తెలంగాణకు భారీ వర్ష సూచన
తెలంగాణలో ఆదివారం కురిసిన భారీ వర్షాలు, పిడుగులు పెను విషాదాన్ని మిగిల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వానలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. పిడుగుపాటుకు సెల్ ఫోన్ పేలిపోవడంతో నిజామాబాద్ జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, కామారెడ్డి జిల్లాలో మరో ఇద్దరు రైతులు తీవ్రంగా గాయపడ్డారు.పదుల సంఖ్యలో మూగజీవాలు కూడా బలయ్యాయి.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం దేవితండాకు చెందిన చరణ్ సింగ్ (18) అనే ఇంటర్ విద్యార్థి పొలంలో తన బాబాయ్‌కి సాయం చేసి ఇంటికి తిరిగి వస్తున్నాడు. మార్గమధ్యంలో భారీ వర్షం మొదలైంది. అదే సమయంలో పెద్ద శబ్దంతో పిడుగు పడటంతో చరణ్ జేబులో ఉన్న సెల్ ఫోన్ పేలిపోయింది. దీంతో అతడు అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఇలాంటి ఘటనే కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో చోటుచేసుకుంది. బొప్పాజీవాడకు చెందిన మేకల సూర్యకాంత్, బుర్గుల్ గ్రామానికి చెందిన గైని శంకర్ అనే ఇద్దరు రైతులు పత్తి చేనులో పనిచేస్తుండగా వర్షం రావడంతో గొడుగు పట్టుకుని నిల్చున్నారు. వారి సమీపంలో పిడుగు పడటంతో ఇద్దరి వద్ద ఉన్న సెల్ ఫోన్లు పేలిపోయి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని గాంధారి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది.
భారీగా పశు నష్టం.. ధ్వంసమైన ఆస్తులు
పిడుగుల ధాటికి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతులు భారీగా నష్టపోయారు. నిర్మల్ జిల్లా రూరల్ మండలంలో ఆరు గేదెలు, ఒక ఆవు మృతి చెందాయి. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం రామారావుపల్లిలో పిడుగు పడి 12 గొర్రెలు మరణించాయి. ఆదిలాబాద్, భద్రాద్రి జిల్లాల్లోనూ ఎద్దులు, ఆవులు పిడుగుపాటుకు బలయ్యాయి. దీంతో లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని సేవాలాల్ ఆలయంపై పిడుగు పడటంతో గుడి పాక్షికంగా దెబ్బతిన్నది.
భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగింది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ - మైల్వార్ మధ్య నిర్మిస్తున్న రోడ్డుకు వేసిన తాత్కాలిక డైవర్షన్ రోడ్డు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. హైదరాబాద్ నగరంలోని కాప్రా, మేడ్చల్, షేక్‌పేట్, దమ్మాయిగూడ వంటి ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. కుత్బుల్లాపూర్‌లో విద్యుత్ తీగలు తెగిపడటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
మరో రెండు రోజులు భారీ వర్షాలు
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.