ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. ఆ ఇద్దరికీ కూడా పోస్టింగ్
- రాష్ట్రంలో 9 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం
- సీఐడీ సైబర్ క్రైమ్స్ ఐజీగా జయలక్ష్మికి నియామకం
- ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ఐజీగా కాంతి రాణాకు పోస్టింగ్
- విశాల్ గున్నీకి శిక్షణ విభాగం డీఐజీగా బాధ్యతలు
- పల్నాడు, మార్కాపురం, పోలవరం జిల్లాలకు కొత్త ఎస్పీలు
- తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ప్రభుత్వ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పోలీసు శాఖలో కీలక మార్పులు చేపట్టింది. ఈ మేరకు 9 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో పలు కీలక విభాగాలతో పాటు, మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు.
వివరాల్లోకి వెళితే, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) డీజీగా ఉన్న సి.హెచ్. త్రివిక్రమ్ వర్మను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) డైరెక్టర్‌గా నియమించారు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్‌గా పనిచేస్తున్న జయలక్ష్మిని సీఐడీ సైబర్ క్రైమ్స్ ఐజీగా బదిలీ చేశారు. ఏపీఎస్పీ బెటాలియన్ల ఐజీగా ఉన్న బి. రాజకుమారిని రైల్వేస్ ఐజీగా నియమిస్తూ, సీఐడీ మహిళా భద్రత విభాగం ఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
గ్రేహౌండ్స్ డీఐజీగా ఉన్న బాబుజీ అట్టాడను టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా బదిలీ చేశారు.
జిల్లా స్థాయిల్లోనూ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పోలవరం ఓఎస్డీగా ఉన్న పంకజ్ కుమార్ మీనాను మార్కాపురం జిల్లా ఎస్పీగా నియమించారు. సీఐడీ ఎస్పీగా ఉన్న కె. చక్రవర్తిని పోలవరం జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. ఇక సీఎం సెక్యూరిటీ గ్రూప్ (సీఎంఎస్‌జీ) ఎస్పీగా ఉన్న జగదీశ్ అడహళ్లికి పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. బదిలీ అయిన అధికారులు తక్షణమే తమ కొత్త బాధ్యతలు స్వీకరించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పరిపాలనా సౌలభ్యం, శాఖల బలోపేతం లక్ష్యంగా ఈ బదిలీలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ముంబై నటి కాదంబరి జెత్వానీ వ్యవహారంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొన్న ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీ సస్పెండైన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రభుత్వం వీరిద్దరిపై సస్పెన్షన్ ఎత్తివేసింది. దాంతో వారి పోస్టింగ్ కు మార్గం సుగమం అయింది. ఈ క్రమంలో ఈ ఇద్దరు అధికారులకు తాజా బదిలీల్లో పోస్టింగ్ ఇచ్చారు. కొంతకాలంగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న కాంతి రాణాకు ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ ఐజీగా కీలక బాధ్యతలు ఇచ్చారు. అదేవిధంగా, పోస్టింగ్ కోసం వేచి ఉన్న మరో అధికారి విశాల్ గున్నీకి శిక్షణ విభాగం డీఐజీగా బాధ్యతలు అప్పగించారు.