సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- పారితోషికంలో రాజీపడని రకుల్
- సీక్వెల్ కి రెడీ అవుతున్న నిఖిల్
- మరోసారి పాట పాడిన విక్రం
* నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ఆమధ్య వచ్చిన 'కార్తికేయ' చిత్రం విజయాన్ని సాధించింది. దీంతో ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికి స్క్రిప్ట్ సిద్ధమైందని, నిఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.
* గతంలో రెండు మూడు సినిమాలలో పాటలు పాడిన తమిళ హీరో విక్రం తాజాగా మరోసారి గొంతు సవరించాడు. తాను హీరోగా నటిస్తున్న 'కాదరన్ కొండన్' చిత్రం కోసం గిబ్రాన్ సంగీత సారథ్యంలో విక్రం ఈ పాట పాడాడట.