హన్సిక హారర్ మూవీలో శింబు గెస్ట్ రోల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హన్సిక హారర్ మూవీలో శింబు గెస్ట్ రోల్

  • హన్సిక ప్రధానపాత్రధారిగా 'మహా'
  • కెరియర్లో 50వ సినిమా 
  • హారర్ నేపథ్యంలో సాగే కథ
అందాల కథానాయిక హన్సిక తాజా చిత్రంగా 'మహా' రూపొందుతోంది. హన్సికకి ఇది 50వ సినిమా కావడంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఇది నాయిక ప్రాధాన్యత కలిగిన హారర్ స్టోరీ .. కథ అంతా కూడా హన్సిక చుట్టూనే తిరుగుతుంది. అయితే ఈ సినిమాలో కీలకమైనదిగా అనిపించే గెస్ట్ రోల్ ఒకటి ఉందట. ఈ పాత్ర శింబు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దర్శకుడు జమీల్ ఆయనని సంప్రదించడం .. దర్శకుడితో గల సాన్నిహిత్యం కారణంగా శింబు ఓకే చెప్పేయడం జరిగిపోయాయట.

అయితే గతంలో శింబు .. హన్సిక మధ్య ప్రేమవ్యవహారం నడిచిన సంగతి తెలిసిందే. వీళ్ల ప్రేమ .. పెళ్లి వరకూ వచ్చి ఆగిపోయింది. అప్పటి నుంచి ఇద్దరూ ఎవరి దారి వారిదన్నట్టుగానే వుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హన్సిక సినిమా చేయడానికి శింబు అంగీకరించడం ఆశ్చర్యం .. ఆమె అభ్యంతరాన్ని వ్యక్తం చేయకపోవడం విశేషం.
hansika

More Telugu News