135 దేశాల్లోని 25 లక్షల ప్రవాస ఆంధ్రులకు నేను చెప్పేది ఒక్కటే!: నారా లోకేశ్

  • కువైట్ ప్రవాసాంధ్రులతో శంఖారావం సభ
  • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించిన లోకేశ్
  • ఏపీకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని పిలుపు
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ కువైట్ లో ఉన్న ఆంధ్రులతో ‘శంఖారావం సభ’ను నిర్వహించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి తెలుసుకోవాలన్న తపన కువైట్ లో స్థిరపడ్డ తెలుగువారిలో కనిపిస్తోందని లోకేశ్ వ్యాఖ్యానించారు.
ఈ విషయమై ట్విట్టర్ లో స్పందిస్తూ..‘కువైట్ శంఖారావం సందర్భంగా అక్కడ స్థిరపడ్డ తెలుగువారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాను. అక్కడ ఉంటున్నప్పటికీ జన్మభూమిలో జరిగే అభివృద్ధిని తెలుసుకోవాలన్న తపన వారిలో కనిపించింది. అందుకే ఏపీలో ఈ నాలుగున్నర ఏళ్ళలో జరిగిన అభివృద్ధి గురించి వారికి వివరించాను.

ప్రపంచంలోని 135 దేశాల్లో ఉన్న 25 లక్షల మంది ప్రవాసాంధ్రులకు నేను చెప్పేది ఒక్కటే. ఏ  దేశంలో ఉన్నా ప్రవాసాంధ్రులంతా ఆంధ్రప్రదేశ్ కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారి రాష్ట్ర అభివృద్ధిలో భాగం కావాలి’ అని ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Nara Lokesh
Telugudesam
SAMKHARAVAM
KUWAIT
25 LAKH

More Telugu News