బీహార్ ఇంజినీర్స్ రిక్రూట్ మెంట్ లో విచిత్రం: మెరిట్ లిస్టులో సన్నీలియోన్ టాప్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీహార్ ఇంజినీర్స్ రిక్రూట్ మెంట్ లో విచిత్రం: మెరిట్ లిస్టులో సన్నీలియోన్ టాప్!

  • ప్రొవిజనల్ జాబితాలో అమ్మడి పేరు
  • జనరల్ కేటగిరీలో అత్యధిక మార్కులు
  • ఆకతాయి పనిగా భావిస్తున్న అధికారులు
బీహార్ ప్రభుత్వం నిర్వహించిన ఇంజినీర్స్ రిక్రూట్ మెంట్ లో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పేరు కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బీహార్ పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ (పీహెచ్ఈడీ) ఇంజినీర్ల నోటిఫికేషన్ లో భాగంగా ప్రొవిజనల్ జాబితాను మంగళవారం విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్న అభ్యర్థి పేరు సన్నీ లియోన్ అని ఉండడం చూసి అధికారులు షాక్ తిన్నారు.

అంతేకాదు, సదరు అభ్యర్థికి వచ్చిన మార్కులు కుడా దిమ్మదిరిగిపోయేలా ఉన్నాయి. మొత్తం 98.50 పాయింట్లు స్కోర్ చేసినట్టు ప్రొవిజనల్ లిస్టులో పేర్కొన్నారు. దరఖాస్తుదారు పేరు సన్నీ లియోన్ అని, తండ్రి పేరు లియోనా లియోన్ అని ఆ జాబితాలో ఉంది. అంతేకాదు, ఆమె అకడమిక్ పెర్ఫార్మెన్స్ కు కూడా గణనీయమైన స్థాయిలో 73.50 పాయింట్లు లభించాయి.

ఈ వ్యవహారంపై పీహెచ్ఈడీ సంయుక్త కార్యదర్శి స్పందిస్తూ... ఇది ఎవరో ఆకతాయిలు చేసిన తుంటరి పనిగా భావిస్తున్నామని తెలిపారు. ఈ జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్న పేరే కాదు, మూడో స్థానంలో ఉన్న పేరు కూడా అనుమానాస్పదంగా ఉంది. కాండిడేట్ నేమ్ అనే కాలమ్ లో ఆంగ్ల అక్షరాలను అర్థంపర్థం లేకుండా పేర్చారు. అయితే లిస్టులో టాప్ లేపిన ఈ 'సన్నీ లియోన్' కు తన ఐడెంటిటీ నిరూపించుకునేందుకు అధికారులు ఫిబ్రవరి 24 వరకు గడువు ఇచ్చారు. ఐడెంటిటీ నిరూపించుకోలేకపోతే రిక్రూట్ మెంట్ నుంచి అనర్హత వేటు వేస్తామని పీహెచ్ఈడీ అధికారులు హెచ్చరించారు.
Sunny Leone

More Telugu News