Rana: చంద్రబాబుగా రానా రూపాంతరం... వైరల్ అవుతున్న 'మహానాయకుడు' మేకింగ్ వీడియో!

షార్ట్స్‌లో చూడండి
ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మహానాయకుడు' ఈ శుక్రవారం నాడు విడుదలకానుండగా, సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్, రానా మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఈ చిత్రంలో చంద్రబాబునాయుడి పాత్రను రానా పోషిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే, చంద్రబాబుగా రానా ఎలా రూపాంతరం చెందారు? ఆయనకు మేకప్ వేసి, చంద్రబాబులా కనిపించేలా ఎలా చూశారు? ఆపై బాబు హావభావాలను, నడవడికను, స్టయిల్ ను రానా ఎలా నేర్చుకున్నారన్న వివరాలను పొందుపరుస్తూ, ఒక నిమిషం పైగా ఉన్న వీడియో విడుదలైంది. రానా మేకింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దాన్ని మీరూ చూడవచ్చు.
Go Back to Shorts
Rana
Chandrababu
Mahanayakudu
Making Video

More Telugu News