కల్యాణ్ రామ్ మూవీ నుంచి ఫస్టు లిరికల్ వీడియో సాంగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కల్యాణ్ రామ్ మూవీ నుంచి ఫస్టు లిరికల్ వీడియో సాంగ్

  • గుహన్ దర్శకత్వంలో '118'
  • డిఫరెంట్ లుక్ తో కల్యాణ్ రామ్
  • సంగీత దర్శకుడిగా శేఖర్ చంద్ర    
కల్యాణ్ రామ్ కథానాయకుడిగా గుహన్ దర్శకత్వంలో '118' సినిమా రూపొందుతోంది. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో, నివేదా థామస్ .. షాలినీ పాండే కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి కల్యాణ్ రామ్ - షాలినీ పాండే కాంబినేషన్లోని ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేశారు.

"చందమామే చేతికందే .. వెన్నెలేమో మబ్బులోనే .., పూల చెట్టే కళ్లముందే .. పూవులేమో కొమ్మపైనే .., చూస్తూనే ఎంతసేపు .. తాకితేనే ఏంటి తప్పు .. పాతికేళ్ల బ్రహ్మచారి బాధ చూడవా .. " అంటూ ఈ సాంగ్ సాగుతోంది. శేఖర్ చంద్ర సంగీతం .. రామాంజనేయులు సాహిత్యం .. యాజిన్ నిజర్ ఆలాపన యూత్ ను ఆకట్టుకునేలా వున్నాయి. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.
kalyan ram
Niveda Thomas
shalini

More Telugu News