మొదట్లో బాధపడేదానిని.. ఇప్పుడు రూమర్స్ అలవాటైపోయాయి: హీరోయిన్ అంజలి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మొదట్లో బాధపడేదానిని.. ఇప్పుడు రూమర్స్ అలవాటైపోయాయి: హీరోయిన్ అంజలి

  • హీరో 'జై'తో ప్రేమ వ్యవహారం 
  • మనస్పర్ధలు తలెత్తాయంటూ ప్రచారం
  • ఒకప్పుడు ఏడ్చేదానిని        
తెలుగు .. తమిళ భాషల్లో అంజలికి మంచి గుర్తింపు వుంది. తనదైన స్టైల్లో సహజమైన నటనను ప్రదర్శించడం అంజలి ప్రత్యేకత. అలాంటి అంజలికి తెలుగులో చాలా వరకూ అవకాశాలు తగ్గిపోయాయి. ఇక 'జై'తో ప్రేమలో పడిన దగ్గర నుంచే ఆమె కెరియర్ పై పెద్దగా దృష్టి పెట్టలేదనే టాక్ వుంది. హీరో 'జై' .. అంజలి కలిసి ఒకే ఫ్లాట్ లో వుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఒకరి బర్త్ డే కి ఒకరు హడావిడి చేసేశారు. షూటింగ్ సమయంలో వెళ్లి మరీ కేకులు కట్ చేయించారు.

త్వరలో పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు వచ్చాయి .. ఆ తరువాత మనస్పర్థలు వచ్చాయనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వూలో అంజలి ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 'జై'తో ఆమె ప్రేమ వ్యవహారం గురించి అడిగిన ప్రశ్నకి అంజలి స్పందిస్తూ .. "ఇలాంటి రూమర్స్ ఎలా పుడతాయో .. ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో తెలియదు. కెరియర్ ఆరంభంలో ఇలాంటి పుకార్లకి బాధపడేదాన్ని .. ఏడ్చేదాన్ని కూడా. కానీ ఇప్పుడు అలవాటైపోయాయి. ఎలాంటి పుకార్లయినా కొన్ని రోజులే హల్ చల్ చేస్తాయి .. ఆ తరువాత అంతా మరిచిపోతారు" అంటూ షాక్  ఇచ్చింది.
anjali

More Telugu News