తెలంగాణ సీఎం కేసీఆర్, జగన్ లపై ఏపీ మంత్రి లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు!
- జగన్, కేసీఆర్ మోదీకి బీ-టీమ్
- అందుకే కోల్ కతా ర్యాలీకి రాలేదు
- ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ నేత
లోకేశ్ ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ పశ్చిమబెంగాల్ సీఎం మమతా దీదీకి మద్దతుగా కోల్ కతా ర్యాలీలో పాల్గొంటే, ఫెడరల్ ఫ్రంట్ కు సుప్రీం లీడర్ అని చెప్పుకుంటున్న ఓ వ్యక్తి, అవినీతి రాజు అయిన దొంగబ్బాయి మాత్రం కనిపించలేదు. వీరిద్దరూ మోదీ బీ-టీమ్ అనడానికి ఇంతకంటే ఆధారం ఏం కావాలి’ అని ట్వీట్ చేశారు.