nidhi agarwal: నన్ను కామెంట్ చేసినవారికి తగిన సమాధానం చెప్పాను: నిధి అగర్వాల్

షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో పరిచయమైన అందాల కథానాయికల జాబితాలో నిధి అగర్వాల్ కూడా కనిపిస్తుంది. ఆమె తాజా చిత్రంగా వచ్చిన 'మిస్టర్ మజ్ను' ప్రస్తుతం థియేటర్స్ లో వుంది. తాజా ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్ మాట్లాడుతూ .. "తెలుగులో నేను చేసిన 'సవ్యసాచి' చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. అప్పుడు నేను చాలా నిరాశకి లోనయ్యాను. అయితే అదే పనిగా ఆలోచిస్తూ .. ఏడుస్తూ కూర్చునే రకం కాదు నేను.

'సవ్యసాచి' విడుదలైన సమయంలోనే 'చూడటానికి అందంగానే ఉంటుందిగానీ .. నటన అంతంత మాత్రమే' అంటూ కొంతమంది నన్ను కామెంట్ చేశారు. నా నటనతోనే వాళ్లకి సమాధానం చెప్పాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. అదృష్టం కొద్దీ 'మిస్టర్ మజ్ను'లో నటనకి అవకాశం వున్న పాత్ర లభించింది .. నా నటనకి మంచి పేరు వచ్చింది. నన్ను విమర్శించిన వాళ్లకి సరైన సమాధానం ఇచ్చాననే అనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చింది. 
Go Back to Shorts
nidhi agarwal

More Telugu News