'మహా' షూటింగులో గాయపడిన హన్సిక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మహా' షూటింగులో గాయపడిన హన్సిక

  • అందాల కథానాయికగా హన్సికకి క్రేజ్
  • తమిళంలో బిజీ హీరోయిన్
  • 50వ చిత్రంగా రానున్న 'మహా'  
తెలుగు .. తమిళ భాషల్లో అందాల కథానాయికగా హన్సికకి మంచి క్రేజ్ వుంది. అయితే తెలుగులో కన్నా తమిళంలో ఆమెకి ఎక్కువగా అవకాశాలు రావడంతో, అక్కడే వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అడపా దడపా తెలుగు తెరపై కూడా మెరుస్తూనే వచ్చింది. అలా 49 సినిమాలు పూర్తి చేసిన హన్సిక, తమిళంలో 50వ సినిమా చేస్తోంది.

ఆమె 50వ చిత్రంగా 'మహా' రూపొందుతోంది. నూతన దర్శకుడు జమీల్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. థ్రిల్లర్ నేపథ్యంలో జరిగే కథ ఇది. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తూ ఉండగా, హన్సిక జారిపడిపోవడంతో ఆమె చేతికి గాయమైందట. అయినా హన్సిక ఆ గాయాన్ని లెక్క చేయకుండా షూటింగులో పాల్గొన్నట్టుగా చెబుతున్నారు. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
hansika

More Telugu News