పాండ్యా, కేఎల్ రాహుల్ విషయంలో పరిస్థితి చేయి దాటిపోయింది.. నన్ను క్షమించండి: కరణ్ జొహార్
- పాండ్యా, రాహుల్ లను నా షోకు నేనే ఆహ్వానించా
- జరిగిన ఘటనతో నిద్రలేని రాత్రులను గడిపా
- నేను చెప్పే మాటను ఇప్పుడు ఎవరు వింటారు?
ఈ నేపథ్యంలో ఈ అంశంపై కరణ్ జొహార్ ఆవేదన వ్యక్తం చేశాడు. 'నా షోకు పాండ్యా, రాహల్ లను నేను ఆహ్వానించాను. కాబట్టి నా కార్యక్రమానికి సంబంధించి నేనే బాధ్యత వహించాలి. జరిగిన ఘటనతో నేను ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపాను. నా వల్ల వీరికి తీరని నష్టం జరిగిందని బాధ పడ్డాను. ఇప్పుడు పరిస్థితి చేయి దాటి పోయింది. నేను చెప్పే మాటను ఎవరు వింటారు? నన్ను క్షమించండి' అంటూ తన బాధను వ్యక్తీకరించాడు.
మరోవైపు 'కాఫీ విత్ కరణ్' షో నిర్వాహకులు ఈ షోకు సంబంధించిన వీడియోలను వారి అఫీషియల్ వెబ్ సైట్ నుంచి తొలగించారు.