నిరసనల మధ్య బర్గర్ వివాదం.. అధికార ప్రతినిధిపై కాక్రోచ్ జనతా పార్టీ వేటు

Vijeta Dahiya suspended by Cockroach Janata Party over burger controversy during protests
  • కాక్రోచ్ జనతా పార్టీ అధికార పదవి నుంచి విజేత దహియా తొలగింపు
  • నిరసనల మధ్య అసందర్భంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై చర్యలు
  • సహచరులు దీక్షలో ఉండగా బర్గర్ తింటున్న వీడియో వైరల్ కావడంతో వివాదం
యువజన ఉద్యమ పార్టీగా గుర్తింపు పొందిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), తమ అధికార ప్రతినిధి విజేత దహియాపై క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ఆయన ప్రవర్తన తీవ్ర వివాదాస్పదం కావడంతో, పార్టీ ఆయనపై వేటు వేస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. దహియాను తక్షణమే అన్ని అధికారిక బాధ్యతల నుండి తొలగిస్తున్నట్లు పార్టీ స్పష్టం చేసింది.

'నీట్' పరీక్షల్లో నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై జవాబుదారీతనం వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సోనమ్ వాంగ్‌చుక్ వంటి ప్రముఖులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టగా, అదే నిరసన స్థలికి సమీపంలో దహియా బర్గర్ తింటూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై వివరణ కోరగా, తాను ఎన్నికైన ప్రతినిధిని కానని, కేవలం స్వచ్ఛందంగానే ఉద్యమంలో పాల్గొంటున్నానని, తానెవరికీ బాధ్యత వహించాల్సిన అవసరం లేదని ఆయన సమాధానమివ్వడం మరింత వివాదానికి దారితీసింది.

ఈ ఉదంతంపై సీజేపీ నాయకత్వం తీవ్రంగా స్పందించింది. దహియా ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, అది పార్టీ విలువలకు, ఉద్యమ సిద్ధాంతాలకు విరుద్ధమని 'ఎక్స్' వేదికగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. క్లిష్ట సమయాల్లో సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఆయనలో పూర్తిగా లోపించిందని పార్టీ ఘాటుగా వ్యాఖ్యానించింది.
Advertisement
Vijeta Dahiya
Cockroach Janata Party
Jantar Mantar Protest
NEET Exam Controversy
Sonam Wangchuk Hunger Strike

More Telugu News