రాహుల్ గాంధీ మాట మార్చారు: కేంద్రమంత్రి జితేంద్ర సింగ్

Rahul Gandhi changed his word says Union Minister Jitendra Singh
  • నీట్‌పై చర్చ విషయంలో రాహుల్ గాంధీ మాట మార్చారని కేంద్రం ఆరోపణ
  • ప్రధాని నివాసం సమీపంలో కాంగ్రెస్ నిరసన.. పాల్గొన్న రాహుల్, ప్రియాంక
  • ధర్నా వద్దకు వెళ్లి రాహుల్‌తో మాట్లాడిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
  • మంత్రుల రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్.. చర్చలు విఫలమయ్యాయని ప్రకటన
నీట్-యూజీ పరీక్ష వివాదంపై పార్లమెంటులో చర్చకు సిద్ధమని చెప్పినా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చివరి నిమిషంలో మాట మార్చారని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. దీంతోప్రతిష్టంభన ఏర్పడిందని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ఇచ్చిన మాటకు రాహుల్ కట్టుబడలేదని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వంటి కొత్త షరతులు పెట్టడంతో చర్చలు ముందుకు సాగలేదని ఆయన విమర్శించారు.

నీట్ పరీక్షలో అవకతవకలు, విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ సహా పలువురు కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలోని ప్రధాని నివాసం సమీపంలో ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో ధర్నా ప్రారంభమైన గంట తర్వాత మంత్రి జితేంద్ర సింగ్ అక్కడికి చేరుకుని రాహుల్‌తో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాకు వివరణ ఇచ్చారు. నీట్ అంశంపై చర్చ జరపాలన్న కాంగ్రెస్ డిమాండ్‌కు కేంద్రం అంగీకరించిందని, కానీ ఆ తర్వాత రాహుల్ గాంధీ మరో కొత్త డిమాండ్‌ను తెరపైకి తేవడంతో చర్చలు విఫలమయ్యాయని జితేంద్ర సింగ్ వివరించారు.

మరోవైపు, ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. నీట్ వివాదానికి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమ పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. చర్చలు కొలిక్కి రాకపోవడంతో తమ నిరసన కొనసాగుతుందని ఆ పార్టీ నేతలు ప్రకటించారు.
Advertisement
Rahul Gandhi
Jitendra Singh
NEET UG controversy
Dharmendra Pradhan resignation
Congress Delhi protest
NEET exam irregularities

More Telugu News