'మిస్టర్ మజ్ను' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్
- మరో ప్రేమకథా చిత్రంగా 'మిస్టర్ మజ్ను'
- ఈ నెల 19న ప్రీ రిలీజ్ ఈవెంట్
- 25వ తేదీన సినిమా విడుదల
హైదరాబాద్ .. ఫిల్మ్ నగర్లోని జెఆర్సీ కన్వెన్షన్ లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. ఆ రోజున సాయంత్రం జరిగే ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరుకానున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో రొమాంటిక్ హీరోగా అఖిల్ కనిపించనున్నాడు. ఈ సినిమా హిట్ కావలసిన అవసరం అఖిల్ కి చాలావుంది. ఇక 'సవ్యసాచి'తో నిరాశ చెందిన నిధి అగర్వాల్ కి కూడా ఈ సినిమా సక్సెస్ చాలా అవసరమే. మరి ఈ ఇద్దరి కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.