పెట్రోల్, డీజిల్ పై నేడు కూడా వడ్డనే!
- లీటరు పెట్రోలుపై 38 పైసలు పెంపు
- 49 పైసలు పెరిగిన డీజిల్ ధర
- ఢిల్లీలో రూ. 70.13కి లీటరు పెట్రోల్
పెరిగిన ధరల ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 70.13కు చేరగా, డీజిల్ ధర రూ. 64.18కి పెరిగింది. ముంబైలో పెట్రోలుపై 38 పైసలు, డీజిల్ పై 52 పైసల మేరకు ధర పెరిగింది. దీంతో లీటరు పెట్రోలు ధర రూ. 75.77కు, డీజిల్ ధర రూ. 67.18కి చేరింది. ఆదివారం నాడు పెట్రోలు ధర ఏకంగా 60 పైసలు పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో రెండు రోజుల వ్యవధిలోనే పెట్రోలు ధర లీటరుకు ఒక రూపాయి పెరిగినట్లయింది.