చాలా రోజుల తరువాత... నేడు పెరిగిన పెట్రోలు ధర!

  • లీటరు పెట్రోలుపై 21 పైసల పెంపు
  • 8 పైసలు పెరిగిన డీజిల్ ధర
  • ఢిల్లీలో రూ. 68.50కి పెట్రోలు ధర
చాలా రోజులుగా తగ్గుతూ వస్తున్న పెట్రోలు ధర సోమవారం నాడు స్వల్పంగా పెరిగింది. నేడు లీటరు పెట్రోలు ధరను 21 పైసల మేరకు, డీజిల్ ధరను 8 పైసల మేరకు పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రకటించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇటీవల క్రూడాయిల్ ధరలు స్వల్పంగా పెరిగిన నేపథ్యంలోనే ఓఎంసీలు ధరను పెంచాయి. పెరిగిన ధరల తరువాత ఢిల్లీలో పెట్రోలు ధర రూ. 68.50, డీజిల్ ధర రూ. 62.24గా ఉండగా, ముంబైలో పెట్రోలు ధర రూ. 74.16, డీజిల్ ధర రూ. 65.12గా ఉంది.
Go Back to Shorts
Petrol
Diesel
Price Hike

More Telugu News