కేంద్రంపై పోరాడి, రాజీనామా చేసుంటే బాగుండేది!: మాణిక్యాలరావు రాజీనామాపై చంద్రబాబు

  • బీజేపీపై పోరాడకుండా రాజకీయాలు చేస్తున్నారు
  • చిల్లర రాజకీయాలతో బెదిరించడం సరికాదు 
  • పశ్చిమగోదావరి జిల్లా టీడీపీకి కంచుకోట
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావు రాజీనామాపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఏపీ ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీపై పోరాడకుండా... రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

సొంత జిల్లాలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని... అయినా, మాణిక్యాలరావు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని విమర్శించారు. కేంద్రంపై పోరాడి, రాజీనామా చేసుంటే బాగుండేదని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా టీడీపీకి కంచుకోట అని చెప్పారు. చిల్లర రాజకీయాలు, రాజీనామాలతో బెదిరించడం సరికాదని అన్నారు. 
Go Back to Shorts
Chandrababu
manikyala rao
resign
Telugudesam
bjp

More Telugu News