Chandrababu: ప్రియమైన చంద్రబాబు.. నా రాష్ట్రానికి నీవు కావాలి: విజయవాడలో ఫ్లెక్సీ

షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతుగా విజయవాడలో వెలసిన ఓ ఫ్లెక్సీ అందరినీ ఆకట్టుకుంటోంది. భావిశెట్టి భాను అనే వ్యక్తి ఈ ఫ్లెక్సీని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ఏర్పాటు చేశారు.

'ప్రియమైన చంద్రబాబు.. కేంద్రం నీపై కక్ష కట్టింది. స్వరాష్ట్రంలో ప్రతిపక్షాలు, పక్క రాష్ట్ర నాయకులు అందరూ ఒక్కటయ్యారు. నేరగాళ్లు, అవినీతిపరులకు నువ్వంటే పడదు. సినీ పరిశ్రమ తన స్వార్థం చూసుకుంటోంది. నీకు సొంత మీడియా కూడా లేదు. ఇప్పుడు నువ్వు ఒంటరివి. కానీ... నేను మాత్రం నీవైపే ఉన్నాను. ఎప్పుడూ ఉంటాను. ఎందుకంటే... నా పిల్లలకు బంగారు భవిష్యత్తు కావాలి. నేను గర్వంగా తలెత్తుకు తిరగాలి. నా రాష్ట్రానికి నువ్వు కావాలి.' అంటూ ఫ్లెక్సీలో తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Chandrababu
flexy
vijayawada
Telugudesam

More Telugu News