వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇకపై చాటింగ్ చేస్తూ వీడియోలు చూసేయొచ్చు!

  • 'పిక్చర్ ఇన్ పిక్చర్' పేరిట కొత్త ఫీచర్
  • వాట్సాప్ లోనే ప్రత్యేక విండోలో వీడియో చూసేయొచ్చు
  • వర్షన్ 2.18.380 వారికి లభ్యం
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ 'పిక్చర్ ఇన్ పిక్చర్' పేరిట కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో వీడియోలని మరో యాప్ కి రీడైరెక్ట్ కాకుండానే వాట్సాప్ లోనే ప్రత్యేక విండోలో చూసేయొచ్చు. ఇతరులతో చాటింగ్ చేస్తూనే థర్డ్ పార్టీ యాప్స్ అయిన యూట్యూబ్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ వీడియోలని వాట్సాప్ లో ప్లే చేసుకోవచ్చు. ప్లేస్టోర్ లో వర్షన్ 2.18.380 కి అప్ డేట్ చేసుకున్నవాళ్లు ఈ సదుపాయాన్ని పొందుతారు. కాగా, ఇప్పటికే ఐఓఎస్ యూజర్లకి ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.
Go Back to Shorts
WhatsApp
Android
Tech-News
technology

More Telugu News