InfinityNSeries: మైక్రోమ్యాక్స్ 'ఇన్ఫినిటీ ఎన్' సిరీస్ స్మార్ట్ ఫోన్ విడుదల.. భారీ ఆఫర్ ప్రకటించిన రిలయన్స్ జియో!

షార్ట్స్‌లో చూడండి
మొబైల్ దిగ్గజ సంస్థ మైక్రోమ్యాక్స్ 'ఇన్ఫినిటీ ఎన్' సిరీస్ నుండి రెండు స్మార్ట్ ఫోన్లని లాంచ్ చేసింది. ఇన్ఫినిటీ ఎన్11, ఇన్ఫినిటీ ఎన్12 పేరిట విడుదలైన ఈ రెండు స్మార్ట్ ఫోన్లలో భారీ బ్యాటరీ ( 4000ఎంఏహెచ్), డ్యూయల్ కెమెరాలతో పాటు మీడియా టెక్ హీలియో పీ22 ప్రాసెసర్ ని అమర్చారు. మైక్రోమ్యాక్స్ ఇన్ఫినిటీ ఎన్11 ఫోన్ ధర రూ.8,999 ఉండగా, మైక్రోమ్యాక్స్ ఇన్ఫినిటీ ఎన్12 ఫోన్ ధర రూ.9,999గా నిర్ణయించారు. ఈనెల 25 నుండే విక్రయానికి అందుబాటులోకి రానున్న ఈ ఫోన్లపై పలు ఆఫర్లు కూడా ఉన్నాయి. రిలయన్స్ జియో వినియోగదారులు రూ.2200 క్యాష్ బ్యాక్ తో పాటు రూ.198, రూ.299 రీఛార్జ్ లపై 50 జీబీ డేటాని ఉచితంగా పొందనున్నారు.
Go Back to Shorts
InfinityNSeries
Micromax Infinity N11
Launched
Tech-News
technology
smartphone
India

More Telugu News