మోదీ ఒక శాడిస్ట్.. కారణం ఇదే: స్టాలిన్
- అమెరికాలో జరిగిన హింసపై మోదీ స్పందించారు
- గజ తుపాను బాధితులను ఓదార్చడానికి మాత్రం రాలేదు
- అదే మహారాష్ట్రలో జరిగితే అక్కడకు స్వయంగా వెళ్లేవారు
మోదీ తనకు తాను సుప్రీంకోర్టు, ఆర్బీఐ, ఐటీగా భావించుకుంటారని స్టాలిన్ ఎద్దేవా చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రధానిగా ఆయన ఊహించుకోవడం లేదని, ఒక చక్రవర్తిగా ఫీలవుతున్నారని విమర్శించారు. చెన్నైలో దివంగత కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రసంగిస్తూ స్టాలిన్ పైవ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి సోనియా, రాహుల్, చంద్రబాబు, పినరయి విజయన్, నారాయణస్వామి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరందరికీ కరుణానిధి ప్రతిమలను స్టాలిన్ అందించారు.