Hansika: చిక్కుల్లో నటి హన్సిక, దర్శకుడు జమీల్

షార్ట్స్‌లో చూడండి
సినీ నటి హన్సికపై కేసు నమోదైంది. ఆమె నటించిన తమిళ సినిమా ‘మహా’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ ఆమెను చిక్కుల్లో పడేసింది. సింహాసనంపై సాధువు వేషధారణలో ‘చిల్లం’ పీలుస్తున్నట్టు ఉన్న ఈ పోస్టర్ వివాదానికి కారణమైంది.

ఈ పోస్టర్‌తో తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ పట్టలి మక్కల్ కచ్చి (పీఎంకే) పార్టీకి చెందిన జానకిరామ్ హన్సిక, దర్శకుడు యూఆర్ జమీల్‌పై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు కావడంపై అటు హన్సిక కానీ, ఇటు దర్శకుడు కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.

ఇటీవల విజయ్ నటించిన సర్కారు సినిమాకు కూడా ఇటీవల ఇటువంటి చిక్కులే ఎదురయ్యాయి. ఈ సినిమా పోస్టర్‌లో విజయ్ పొగ తాగుతున్నట్టు ఉండడంతో పీఎంకే నేత అన్బుమణి రాందాస్ కోర్టుకెక్కారు. వెంటనే ఆ పోస్టర్‌ను తొలగించాలంటూ దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌కు ఆదేశాలివ్వాలంటూ కోర్టును కోరారు.
Go Back to Shorts
Hansika
UR Jameel
Maha
poster
sadhu
chillum

More Telugu News