కొంచెం లవ్ .. మరికొంచెం ఎమోషన్ .. 'పడిపడి లేచె మనసు' ట్రైలర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొంచెం లవ్ .. మరికొంచెం ఎమోషన్ .. 'పడిపడి లేచె మనసు' ట్రైలర్

  • సూర్య పాత్రలో శర్వానంద్ 
  • వైశాలిగా సాయిపల్లవి 
  • లవ్ .. ఎమోషన్ ప్రధానంగా సాగే కథ   
హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ - సాయిపల్లవి జంటగా 'పడి పడి లేచె మనసు' నిర్మితమైంది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా, ఈ నెల 21వ తేదీన థియేటర్లకి రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. "నా పేరు సూర్య .. పేరులోని వెలుగు జీవితంలో మిస్సై సంవత్సరం అవుతోంది. ఏడాది పాటు చీకటితో నేను చేసిన యుద్ధంలో ఇంకా బతికున్నానంటే కారణం వైశాలి" అంటూ శర్వానంద్ వాయిస్ పై ట్రైలర్ మొదలవుతోంది.

"ఒక మనిషి గురించి జీవితంలో ఇంతగా తాపత్రయపడటం కరెక్ట్ కాదేమో .. సూర్య అనేవాడు ఇక నా జీవితంలో లేడుగాక లేడు" అంటూ వైశాలిగా సాయిపల్లవి డైలాగ్ తో ట్రైలర్ కొనసాగుతుంది. ఈ ఇద్దరి డైలాగ్స్ ఆ తరువాత ఏం జరగనుందనే ఆసక్తిని పెంచుతున్నాయి. లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది. యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అవుతుందనిపిస్తోంది. 
sharwanand
saipallavi

More Telugu News