ఫస్ట్ లుక్ ను విడుదల చేసి చిక్కుల్లో పడ్డ హీరోయిన్ హన్సిక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫస్ట్ లుక్ ను విడుదల చేసి చిక్కుల్లో పడ్డ హీరోయిన్ హన్సిక

  • హన్సిక 50వ చిత్రం 'మహా'
  • హుక్కా తాగుతున్నట్టు కనిపించే ఫస్ట్ లుక్
  • కోర్టును ఆశ్రయించిన పీఎంకే
సినిమాల్లో హాఫ్ సెంచరీ మార్క్ ను చేరుకున్న నేటి తరం హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న దక్షిణాది బ్యూటీ హన్సిక, తన తాజా చిత్రం ఫస్ట్ లుక్ తో వివాదాలను కొనితెచ్చుకుంది. తాజాగా 'మహా' చిత్రంలో నటిస్తున్న హన్సిక, సినిమా ఫస్ట్ లుక్ లో దొంగ స్వామిగా కనిపిస్తూ, ఓ కుర్చీలో కూర్చుని హుక్కా తాగుతుండటం విమర్శలకు గురవుతోంది.

ఈ పోస్టర్ హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందంటూ పీఎంకే పార్టీ కోర్టును ఆశ్రయించడంతో, ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించాలని న్యాయమూర్తి నిర్ణయించుకున్నారు. ఈ తాజా వివాదంతో హన్సిక సినిమాకు ప్రచారం వస్తుందా? లేక ఇబ్బందుల్లోకి నెడుతుందా అన్న విషయం ఆసక్తికరమైంది.
Hansika
First Look
Hukka
Mahaa

More Telugu News