బీజేపీకి షాక్.. రాజకీయాల్లోకి రాబోనని ప్రకటించిన హీరోయిన్ మాధురీ దీక్షిత్
- జూన్ లో మాధురిని కలిసిన అమిత్ షా
- పూణే నుంచి పోటీ చేస్తారన్న పార్టీ వర్గాలు
- వార్తలను ఖండించిన బాలీవుడ్ నటి
వాటిని అభిమానులు ఎవరూ నమ్మవద్దని తెలిపింది. ఈ ఏడాది జూన్ లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు కూడగట్టడంలో భాగంగా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీ అయ్యారు. గత నాలుగేళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను వారికి వివరించారు. ఈ నేపథ్యంలో బీజేపీలో ఓ సీనియర్ నేత స్పందిస్తూ.. మాధురీ దీక్షిత్ కు పూణే టికెట్ ను పార్టీ హైకమాండ్ ఖరారు చేసిందని తెలిపారు. దీంతో తాజాగా మాధురీ దీక్షిత్ తన రాజకీయ ప్రవేశంపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది.