చంద్రబాబుకు మకిలి, వెకిలి రాజకీయాలెందుకు?: సీఎం కేసీఆర్
- ప్రజల మధ్య చంద్రబాబు విభేదాలు సృష్టిస్తున్నారు
- చంద్రబాబు ‘తెలుగు జాతి’ అని మాట్లాడతాడు
- ఆ ‘తెలుగు జాతి’ హైదరాబాద్ లో హ్యాపీగా ఉంది
హైదరాబాద్ విశ్వనగరం అని, ఇది ఏ ఒక్కరి సొత్తు కాదని, కులీకుతుబ్ షా కాలం నుంచే సర్వమతాలకు, కులాలకు ఆలవాలంగా ఉన్న నగరమిదని అన్నారు. ఆంధ్రా, రాయలసీమకు చెందిన సోదరులు సంతోషంగా ఈ నగరంలో ఉన్నారని, గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో చాలా అపోహలు సృష్టించారని అన్నారు. నాడు అనవసరమైన భయాలు సృష్టించారని, టీఆర్ఎస్ ప్రభుత్వం అటువంటి అపోహలకు, భయాలకు తావు లేదని నిరూపించిందని అన్నారు.