తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. నెరవేరనున్న ఆర్టీసీ కార్మికుల చిరకాల స్వప్నం
- ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు వేగంగా అడుగులు
- ఆగస్టు మూడో వారంలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించే అవకాశం
- డిసెంబరు 9న విలీనంపై తుది ప్రకటన చేసేందుకు ప్రభుత్వ కసరత్తు
- విలీన విధివిధానాల్లో ఎన్నికల్లో గెలిచిన సంఘానికి భాగస్వామ్యం
- ఏప్రిల్ సమ్మె హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వ చర్యలు
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల నెరవేరే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న చిరకాల వాంఛను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. ప్రణాళిక ప్రకారం అన్నీ జరిగితే, తెలంగాణ ఆవిర్భావ ప్రకటన వెలువడిన డిసెంబరు 9వ తేదీన విలీనంపై తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈలోగా విలీన ప్రక్రియకు సంబంధించిన పూర్తి విధివిధానాలను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
విలీన ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ముందుగా ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం లేబర్ జాయింట్ కమిషనర్ సునీతను నోడల్ అధికారిగా నియమించింది. ఆగస్టు మూడో వారంలో ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఎన్నికల్లో గెలిచిన సంఘాన్ని విలీన విధివిధానాల రూపకల్పనలో భాగస్వామ్యం చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ హామీతో కార్మిక సంఘాలు ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, డిపోల వారీగా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వంలో విలీనం, కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణ, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు వంటి 32 డిమాండ్లను యాజమాన్యం ముందుంచారు. అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు చాలా డిమాండ్లను ఇప్పటికే నెరవేర్చింది. ఇప్పుడు అత్యంత కీలకమైన విలీనం, ఎన్నికల ప్రక్రియలపై దృష్టి సారించింది.
ప్రభుత్వం నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం, మొదట ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి, గెలిచిన సంఘం అభిప్రాయాలను తీసుకుంటారు. ఆ తర్వాత విలీనానికి సంబంధించిన ఆర్థిక, పరిపాలన, న్యాయపరమైన అంశాలపై తుది విధివిధానాలను ఖరారు చేస్తారు. డిసెంబరు 9న విలీనంపై అధికారిక ప్రకటన చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆర్టీసీ యాజమాన్యానికి ప్రభుత్వం నుంచి ఇప్పటికే సంకేతాలు అందినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీ ఉద్యోగుల కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు స్పష్టమవుతోంది.