నాకన్నా బాగా చేస్తున్నావ్ అని ప్రభాస్ మెచ్చుకున్నారు: 'బాహుబలి' చైల్డ్ ఆర్టిస్ట్ సాత్విక్ వర్మ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకన్నా బాగా చేస్తున్నావ్ అని ప్రభాస్ మెచ్చుకున్నారు: 'బాహుబలి' చైల్డ్ ఆర్టిస్ట్ సాత్విక్ వర్మ

  • 'బాహూబలి'లో కొండెక్కే సీన్ అది 
  • రాజమౌళి గారు ధైర్యం చెప్పారు 
  • అప్పుడు ప్రభాస్ అక్కడే వున్నారు
చైల్డ్ ఆర్టిస్ట్ గా సాత్విక్ వర్మ చాలా సినిమాల్లో నటించాడు. తాజా ఇంటర్వ్యూలో తను మాట్లాడుతూ 'బాహుబలి' సినిమాను గురించి ప్రస్తావించాడు. "ఈ సినిమాలో నేను కొండ ఎక్కే సీన్ ఒకటి వుంది. 'నువ్వు ఎక్కగలుగుతావా .. అంత ధైర్యం ఉందా?' అని రాజమౌళి గారు అడిగారు. 'ఏమీ భయపడకు మేమంతా ఉన్నాం కదా .. కొంత దూరం ఎక్కేసి ఆ తరువాత అక్కడి నుంచి కిందికి జారిపో' అని చెప్పారు.

కొంత దూరం కొండ ఎక్కేశాక భయమేసింది .. 'అక్కడి నుంచి జారిపో' అని రాజమౌళి గారు చెప్పడంతో అలాగే చేశాను. అదృష్టం కొద్దీ నాకు ఎలాంటి దెబ్బలు తగల్లేదు. ప్రభాస్ గారు సెట్లో నన్ను డాళింగ్ .. డాళింగ్ అని పిలిచే వారు. నేను కొండెక్కేటప్పుడు ఆయన కిందనే వున్నారు. నేను కొండ దిగిన తరువాత, 'నీకు చాలా ధైర్యం ఎక్కువ డాళింగ్ .. నాకన్నా బాగా చేస్తున్నావ్' అంటూ మెచ్చుకున్నారు' అని చెప్పుకొచ్చాడు.      
sathwik varma

More Telugu News