సాయిపల్లవికి కితాబునిచ్చిన శర్వానంద్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సాయిపల్లవికి కితాబునిచ్చిన శర్వానంద్!

  • శర్వానంద్ జోడీగా సాయిపల్లవి
  • సాయిపల్లవి మంచి నటి అన్న శర్వానంద్  
  • డిసెంబర్ 21వ తేదీన రిలీజ్                  
కథ .. పాత్ర నచ్చితేనే తప్ప సాయిపల్లవి అంగీకరించదు. తనకి నచ్చకపోతే పారితోషికం ఎక్కువ ఇస్తామన్నా చేయనని చెప్పడం ఆమెకే చెల్లింది. అలాంటి సాయిపల్లవి షూటింగుకి ఆలస్యంగా వస్తుందనీ .. తన ధోరణితో హీరోలకి అసహనాన్ని కలిగిస్తుందనే వార్తలు ఆ మధ్య వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమె శర్వానంద్ సరసన 'పడి పడి లేచే మనసు' చేసింది. డిసెంబర్ 21వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.  

ఈ సినిమా షూటింగు సమయంలో సాయిపల్లవి ధోరణి గురించిన వార్తలు బయటికి వస్తాయని ఎదురుచూసినవారికి నిరాశే ఎదురైంది. ఈ సినిమా షూటింగ్ చాలా బాగా జరిగిందని తాజాగా శర్వానంద్ చెప్పాడు. "సాయిపల్లవి మంచినటి .. స్క్రిప్ట్ ను అర్థం చేసుకుని నటించే హీరోయిన్స్ లో ఆమెకి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆమె చాలా తెలివైన హీరోయిన్" అని అన్నాడు. మొత్తానికి సాయిపల్లవికి సంబంధించి ఎలాంటి రూమర్స్ షికారు చేయకపోగా, ఆమెకి మంచి మార్కులు దక్కడం విశేషం.                
sharwanand
saipallavi

More Telugu News