Vivo X21s: 'వివో ఎక్స్21ఎస్' స్మార్ట్ ఫోన్ వచ్చేసింది!

షార్ట్స్‌లో చూడండి
చైనా మార్కెట్లో తాజాగా వివో నుండి నూతన స్మార్ట్ ఫోన్ విడుదలైంది. 'వివో ఎక్స్21ఎస్' పేరిట విడుదలైన ఈ ఫోన్ స్టార్రి నైట్ బ్లాక్ కలర్ లో వినియోగదారులకి అందుబాటులో వుండనుంది. 'వివో వీ11ప్రో' ఫోన్ మోడల్ లో ఉన్న ఫీచర్లు దాదాపుగా 'ఎక్స్21ఎస్' మోడల్ లో ఉన్నాయి. కానీ, అదనంగా 'ఎక్స్21ఎస్' ఫోన్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ సెన్సార్, వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్, స్నాప్ డ్రాగన్ 660 వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఏర్పాటు చేశారు. దీని ధర మనదేశంలో సుమారుగా రూ.26,100గా వుండనుంది.

'వివో ఎక్స్21ఎస్' ఫీచర్లు:

  • 6.41" ఫుల్ హెచ్‌డీ డిస్ప్లే (1080x2340 పిక్సెల్ రిజల్యూషన్ )
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • ఇన్ డిస్ప్లే ఫింగర్ సెన్సార్
  • స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెస్సర్
  • 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • వెనక భాగంలో రెండు 12/5 మెగాపిక్సెల్ కెమెరాలు
  • ముందు భాగంలో 24.8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
  • 3,400ఎంఏహెచ్ బ్యాటరీ
Go Back to Shorts
Vivo X21s
smartphone
Tech-News
technology
China
vivo
India

More Telugu News