సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- గ్లామర్ పాత్రలకు హన్సిక దూరం
- అఖిల్ 'మిస్టర్ మజ్ను' విడుదల తేదీ
- హీరోగా గీత రచయిత తనయుడు!
* అఖిల్ అక్కినేని నటిస్తున్న మూడవ చిత్రం 'మిస్టర్ మజ్ను'కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని జనవరి 24న రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు నిర్ణయించారు.
* ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి తనయుడు రాకేందు మౌళి హీరోగా వస్తున్నాడు. గోరంట్ల సాయినాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పల్లెవాసి' చిత్రంలో రాకేందు హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.