తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో.. నేడు ఓటర్ల జాబితా విడుదల!
- తొలుత హైకోర్టుకు ఓటర్ల జాబితా
- అనంతరం బయటపెట్టనున్న ఈసీ
- 2.61 కోట్ల మంది ఓటర్లతో జాబితా
ప్రస్తుతం ముసాయిదా జాబితా ప్రకారం రాష్ట్రంలో 2.61 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అయితే 2014 ఎన్నికల్లో తెలంగాణలో ఈ సంఖ్య 2.81 కోట్లుగా ఉండేది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 19 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల గడువుకు 10 రోజుల ముందు వరకూ ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అదనంగా 1,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.