Mumbai: పెళ్లి పేరిట ముంబై టీవీ నటిపై అత్యాచారం!

షార్ట్స్‌లో చూడండి
మోడలింగ్ రంగంలో రాణిస్తూ, టీవీ నటిగా అవకాశాలు సంపాదించిన ఓ ముంబై యువతిని పెళ్లి పేరిట మోసం చేసి అత్యాచారానికి తెగబడ్డాడో వ్యక్తి. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముంబైలోని అల్వార్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, 2014లో తాను చదువుకుంటున్న సమయంలో పరిచయమున్న ఓ యువకుడు, ఆపై సోషల్ మీడియా ద్వారా సదరు నటిని తిరిగి కలుసుకున్నాడు. ఇద్దరి మధ్యా మాటలు సాగి, పరిచయం మరింతలోతుకు చేరుకున్న వేళ, వ్యక్తిగతంగా కలవాలని నిర్ణయించుకున్నారు.

దీంతో బాధితురాలు ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లింది. అతను బాధితురాలిని తన కుటుంబీకులకు, స్నేహితులకు పరిచయం చేశాడు. ఆపై ఇద్దరూ కలసి ఈ నెల 4వ తేదీన రాజస్థాన్ లోని నీమ్ రానాకు కలసి వెళ్లారు. అక్కడ రాత్రి పూట ఉండేందుకు రూము తీసుకున్నారు. ఆపై సదరు నటిపై నిందితుడు అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో ముంబైలోని ఓషివారా పోలీస్ స్టేషన్ లో నమోదైన జీరో ఎఫ్ఐఆర్ ను స్వీకరించిన నీమ్ రానా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
Go Back to Shorts
Mumbai
Actress
Model
Rape

More Telugu News