పాత ఐఫోన్లకు చేదువార్త అందించిన వాట్సాప్!
- పాత వర్షన్ ఐఫోన్లకు వాట్సాప్‌లోని కొత్త ఫీచర్లు అందవు
- 2020 తర్వాత వాట్సాప్ సేవల నిలిపివేత
- ఇప్పటికే ప్రారంభమైన ఉపసంహరణ విధానాలు
దీని గురించి వాట్సాప్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ‘పాత వర్షన్ ఐఫోన్లకు వాట్సాప్‌లోని కొత్త ఫీచర్లు అందవు. నూతనంగా వస్తున్న అప్‌డేట్స్ కూడా ఆ ఫోన్లకు వర్తించవు. ఇంతకు ముందున్న ఫీచర్లు కూడా పనిచేయకుండా పోయేందుకు అవకాశం ఉంది. ఐవోఎస్ వెర్షన్ 7, ఇతర పాత వెర్షన్ ఐఫోన్లలో 1 ఫిబ్రవరి 2020 తర్వాత వాట్సాప్ సేవలను నిలిపివేస్తున్నాం’ అని తెలిపారు.
ఇప్పటికే వాట్సాప్ ఉపసంహరణ విధానాలు ప్రారంభమయ్యాయి. 2020 నాటికి ఈ ఫోన్లలో వాట్సాప్ రాదు. ఒకవేళ ఐవోఎస్ 7 మీద నడిచే ఫోన్లలో వాట్పాప్ డిలీట్ అయినా కూడా తిరిగి ఇన్‌స్టాల్ చేసుకోవడం కుదరదు.