ఎన్నికల శంఖారావం పూరించిన అమిత్ షా.. బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య లడాయి మొదలైందంటూ వ్యాఖ్య!
- భారత్ మాతాకీ జై అంటూ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఎన్నికలకు కేసీఆర్ భయపడుతున్నారు
- రెండు ఎన్నికలకు ఎంతో ప్రజా సంపద ఖర్చు అవుతుంది
అనంతరం సభకు భారీ సంఖ్యలో హాజరైన ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, లోక్ సభ, శాసనసభలకు ఎన్నికలు ఒకేసారి జరగాల్సి ఉన్నా... కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని చెప్పారు. ఎన్నికలకు కేసీఆర్ భయపడుతున్నట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. రెండు ఎన్నికల నిర్వహణ కోసం భారీ ఎత్తున ప్రజా సంపద ఖర్చు అవుతుందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య లడాయి మొదలైందని అన్నారు.