ఏపీ సిగలో మరో అంతర్జాతీయ కంపెనీ.. నేడు ‘హెచ్‌సీఎల్ స్టేట్ స్ట్రీట్’ను ప్రారంభించనున్న మంత్రి లోకేశ్
- గన్నవరంలోని మేధా టవర్స్‌లో కార్యాలయం
- వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు
- వచ్చే నెల 8న ఇక్కడే హెచ్‌సీఎల్ కూడా ప్రారంభం
అమెరికాకు చెందిన స్టేట్ స్ట్రీట్- హెచ్‌సీఎల్ కలిసి హెచ్‌సీఎల్ స్టేట్ స్ట్రీట్‌గా ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సంస్థ అమెరికా, కెనడా, యూరప్, మధ్యఆసియా, ఆసియా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మన దేశంలో కోయంబత్తూరులో తొలి శాఖను ప్రారంభించారు. కాగా, అక్టోబరు 8న మేధా టవర్స్‌లోనే హెచ్‌సీఎల్ కంపెనీ కూడా ఏర్పాటు కాబోతుండడం గమనార్హం.