kcr: తెలంగాణకు పెద్ద దరిద్రం కాంగ్రెస్సే: కేసీఆర్

షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణకు పట్టిన పెద్ద దరిద్రం కాంగ్రెస్ పార్టీనే అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ వేసిన బిచ్చం కాదని.. కొట్లాడి, తెగించి తెలంగాణను తెచ్చుకున్నామని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నాశనం చేసిన తెలంగాణను విడిపించిన భూమిపుత్రుడు కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో కుంభకోణాలు, కల్తీలు లేవని చెప్పారు. టీఆర్ఎస్ వల్లే కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో రూ. 2 వేల పెన్షన్ ప్రకటించే పరిస్థితి వచ్చిందని అన్నారు. అన్ని దరిద్రాలకు రిజర్వ్ బ్యాంకే కారణమని విమర్శించారు. 
Go Back to Shorts
kcr
TRS
congress
telangana

More Telugu News