hari krishna: మామయ్య హరికృష్ణ మృతి వ్యక్తిగతంగా తీరని లోటు: నారా లోకేష్

షార్ట్స్‌లో చూడండి
మామయ్య నందమూరి హరికృష్ణ మృతి వ్యక్తిగతంగా తనకు తీరని లోటని నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మెహిదీపట్నంలోని నివాసంలో హరికృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, హరికృష్ణ మానవతావాదని, నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. కాగా, హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు చేరుకుంటున్నారు. మరోపక్క, హరికృష్ణ మృతిపై ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, దేవినేని ఉమ, ఎంపీ కేశినేని తదితరులు తమ సంతాపం తెలిపారు.
Go Back to Shorts
hari krishna
nara lokesh

More Telugu News