harikrishna: ఇంటికి చేరుకున్న హరికృష్ణ పార్థివదేహం.. కాసేపట్లో రానున్న కేసీఆర్

షార్ట్స్‌లో చూడండి
దివంగత హరికృష్ణ పార్థివదేహం హైదరాబాద్ మెహిదీపట్నంలో ఉన్న నివాసానికి చేరుకుంది. కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిలు ఆయన భౌతికకాయాన్ని అంబులెన్సులో నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఇంటి లోపలకు తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, బాలకృష్ణ, నారా లోకేష్ తదితరులంతా ఇంట్లోకి వెళ్లారు. ఇంటి వద్ద బంధుమిత్రులంతా తీవ్ర విషాదంలో ఉన్నారు. మరోవైపు, ఇంటి వద్ద భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడకు చేరుకుని, హరికృష్ణకు నివాళి అర్పించనున్నారు.
Go Back to Shorts
harikrishna
Chandrababu
junior ntr
kcr

More Telugu News