లైంగిక దాడి ఆరోపణలు.. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ అరెస్ట్

Abishek Porel arrested over sexual assault allegations
  • రేప్ కేసులో ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ అభిషేక్ పోరెల్ అరెస్ట్
  • పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని యువతి ఫిర్యాదు
  • కలకత్తా హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు
  • గతంలో ఆరోపణలను ఖండించిన క్రికెటర్ అభిషేక్
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న బెంగాల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్ అరెస్ట్ అయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడని, బెదిరింపులకు గురిచేశాడని ఓ మెడికల్ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కలకత్తా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.

హూగ్లీ రూరల్ ఎస్పీ కున్వర్ భూషణ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. డమ్ డమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమామీ సిటీలో అభిషేక్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జూన్‌లో ఓ మెడికల్ విద్యార్థిని అభిషేక్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత మూడేళ్లుగా తాము రిలేషన్‌షిప్‌లో ఉన్నామని, గత ఏడాది నుంచి అభిషేక్ తనను దూరం పెడుతున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి పలుమార్లు లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. అంతేకాకుండా తనపై దాడి చేసి, తీవ్రంగా బెదిరించాడని కూడా ఫిర్యాదులో తెలిపింది. ఈ కేసులో అభిషేక్‌ను అరెస్ట్ చేయాలని కలకత్తా హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

గతంలో అభిషేక్ ఈ ఆరోపణలన్నింటినీ ఖండించాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన పోరెల్, 2023 నుంచి ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బెంగాల్ తరఫున ఫస్ట్-క్లాస్, లిస్ట్ ఏ మ్యాచ్‌లతో పాటు ఇండియా-ఏ జట్టు తరఫున కూడా ఆడాడు. 
Advertisement
Abishek Porel
Delhi Capitals
Abishek Porel arrested
Sexual assault allegations
Bengal cricket
Calcutta High Court

More Telugu News