అందుకే రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లి కండువా కప్పుకున్నా: పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్య

Pocharam Srinivas Reddy explains why he joined Revanth Reddy
  • పెండింగ్ బిల్లులకు ప్రభుత్వం సగం నిధులే ఇచ్చిందని అసంతృప్తి
  • అన్నం పెట్టిన వారిని ఎప్పటికీ మర్చిపోలేనని వ్యాఖ్య
  • ప్రస్తుతం ముఖ్యమంత్రి, మంత్రులు ఫోన్లు ఎత్తడం లేదని ఆరోపణ
తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరానని, పదవుల కోసమో, డబ్బు కోసమో కాదని బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. పెండింగ్ బిల్లులకు సంబంధించి ప్రభుత్వం సగం నిధులే విడుదల చేయడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం బిర్కూర్‌లో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పెండింగ్ బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారని పోచారం తెలిపారు. గత నవంబర్‌లో పార్టీ మారిన ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో ఇదే విషయాన్ని తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని గుర్తుచేశారు. ఆరు నెలల్లోగా బిల్లులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం సగం నిధులే విడుదలయ్యాయని పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మిగతా మొత్తాన్ని మంజూరు చేయలేదని ఆయన ఆరోపించారు.
Advertisement
Pocharam Srinivas Reddy
Revanth Reddy
Banswada MLA
Telangana Politics
Constituency Development
Pending Bills

More Telugu News