భారత ఆటగాళ్లను 'చీటర్స్' అన్న సంగక్కర.. ఏళ్ల తర్వాత బయటపెట్టిన ఇర్ఫాన్ పఠాన్
- శ్రీలంక దిగ్గజం సంగక్కరతో గొడవను గుర్తుచేసుకున్న ఇర్ఫాన్ పఠాన్
- 2005 టెస్టులో సంగక్కర తనను 'మోసగాళ్లు' అని తిట్టాడని వెల్లడి
- వ్యక్తిగత దూషణలకు కూడా పాల్పడ్డాడని పఠాన్ ఆరోపణ
- బంతుల మార్పిడి వివాదమే గొడవకు అసలు కారణం
- 2008 ఐపీఎల్‌లో ఇద్దరం క్షమాపణలు చెప్పుకున్నమన్న మాజీ పేసర్
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర మధ్య మైదానంలో జరిగిన ఓ తీవ్ర వాగ్వాదాన్ని ఏళ్ల తర్వాత బయటపెట్టాడు. 2005లో జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్‌లో సంగక్కర తనను, భారత ఆటగాళ్లను 'మోసగాళ్లు (చీటర్స్)' అని పిలుస్తూ వ్యక్తిగత దూషణలకు దిగాడని పఠాన్ సంచలన విషయాలు వెల్లడించాడు. అయితే, ఆ తర్వాత ఐపీఎల్ పుణ్యమా అని ఇద్దరూ మళ్లీ కలిసిపోయి మంచి స్నేహితులుగా మారినట్లు కూడా తెలిపాడు.
అసలేం జరిగిందంటే..!
2005లో శ్రీలంకతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ మధ్యలో బంతుల బాక్సును మార్చడంపై శ్రీలంక ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా సంగక్కర దీనిపై చాలా ఆగ్రహంగా ఉన్నాడు. అదే సమయంలో జట్టు యాజమాన్యం కోరిక మేరకు ఇర్ఫాన్ పఠాన్ ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగాడు. ఈ వివాదం గురించి తనకు ఏమాత్రం తెలియదని పఠాన్ పేర్కొన్నాడు.
"నేను ఓపెనర్‌గా బరిలోకి దిగి 93 పరుగులు చేశాను. ఆ ఇన్నింగ్స్‌లో ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు కొట్టాను. కొత్త బంతితో మురళీధరన్‌ను సిక్సర్లు కొట్టడమంటే ప్రత్యర్థి ప్రణాళికలను దెబ్బతీసినట్లే. అది చూసి సంగక్కర అకస్మాత్తుగా స్లెడ్జింగ్ మొదలుపెట్టాడు. 'మీరు మోసగాళ్లు, మీ తల్లిదండ్రులు మీకు ఇవే నేర్పిస్తారా' అంటూ వ్యక్తిగత దూషణలకు దిగాడు. అతను వ్యక్తిగతంగా మాట్లాడటంతో నేను కూడా గట్టిగానే సమాధానం ఇచ్చాను. కానీ, గొడవ మొదలుపెట్టింది అతనే" అని పఠాన్ ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నాడు.
ఐపీఎల్‌లో మళ్లీ కలిశారిలా..!
మైదానంలో శత్రువుల్లా పోట్లాడుకున్న ఈ ఇద్దరూ 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్‌లో కింగ్స్ XI పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) జట్టుకు ఆడారు. వేలం తర్వాత సంగక్కరతో కలిసి ఆడాల్సి వస్తుందని తెలిశాక ఇబ్బందిగా అనిపించిందని పఠాన్ అన్నాడు. "వేలం తర్వాత సంగక్కర, నేను ఒకే జట్టులో ఉన్నామని తెలిసింది. మేం అతని కుటుంబంతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నేనే చొరవ తీసుకుని అతనికి క్షమాపణ చెప్పాను. అతను కూడా నన్ను క్షమించమని కోరాడు. అప్పటి నుంచి మేం మంచి స్నేహితులం అయ్యాం. మైదానంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి, పొరపాట్లు జరుగుతాయి. కానీ, వాటిని ఎంత పరిణతితో పరిష్కరించుకున్నామన్నదే ముఖ్యం" అని పఠాన్ వివరించాడు.