Bengalore: తన కోసం నడిరోడ్డుపై కొట్టుకున్న ఆ ఇద్దరికీ షాకిచ్చిన యువతి!

షార్ట్స్‌లో చూడండి
ఒక యువతి తన భార్యంటే, తన భార్యని ఇద్దరు యువకులు గొడవకు దిగి, నడిరోడ్డుపై కొట్టుకున్న ఘటన గత వారంలో కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో జరుగగా, దీని వీడియో దృశ్యాలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. వారిద్దరూ స్నేహితులేనని, తమతో సంబంధం పెట్టుకున్న యువతి కోసం తన్నుకున్నారని తేల్చిన పోలీసులు, వారి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాల్లో భాగంగా యువతిని పిలిపించి మాట్లాడగా, వారిద్దరికీ షాకిచ్చిందామె,. వీరిద్దరిలో ఎవరినీ వివాహం చేసుకునే ఉద్దేశం లేదని, తాను వీరితో సహజీవనం మాత్రమే చేశానని, మరో వ్యక్తిని పెళ్లి చేసుకోనున్నానని చెప్పిందామె.

ఈ మొత్తం వ్యవహారం వెనుక అసలేమైందన్న విషయాన్ని పరిశీలిస్తే, 2000 సంవత్సరంలో రంగస్వామి అనే వ్యక్తిని పెళ్లాడిన ఆమె 2010లో అతన్నుంచి విడిపోయింది. ఆపై 2015 వరకూ ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రమేష్ కుమార్ అనే వ్యక్తితో సహజీవనం చేసింది. గత సంవత్సరం ఆమె మూర్తి అనే ట్రాక్టర్ డ్రైవర్ తో కనిపించడంతో రమేష్ కూడా దూరమయ్యాడు.

గత ఏడాదిగా మూర్తితో ఆమె సహజీవనం సాగిస్తోంది. ఇదే సమయంలో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న సిద్ధరాజు అనే వ్యక్తి ఆమెకు పరిచయమై పెళ్లి చేసుకుందామని చెప్పాడు. సిద్ధరాజుతోనూ సహజీవనం ప్రారంభించిన ఆమె, గత వారంలో బెంగళూరు - పుణె జాతీయ రహదారిపై తుముకూరు వద్ద కలసి ఉండగా, మూర్తి చూశాడు. ఆపై వారిద్దరి మధ్యా గొడవ జరిగింది. ఇప్పుడా యువతి ఇద్దరికీ హ్యాండివ్వడం కొసమెరుపు
Go Back to Shorts
Bengalore
Karnataka
Two Men
Wife
Fled
Police

More Telugu News